యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో 25 మంది కూలీలు చిక్కుకుని ఉన్నారని స్థానికులు చెబుతున్నట్లు అధికారులు వెల్లడించారు.జనసత్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, ఘటనపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ స్పందించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)