యూపీలో రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు బృందం పట్టుబడింది. టిక్కెట్ కలెక్టర్ తనిఖీ చేయడానికి వస్తూ..వారిని టిక్కెట్ చూపించమని అడగగా.. బెదిరింపులకు దిగారు. అక్కడ ఉన్న ప్రయాణికులను బెదిరించి మరీ ఈ పోలీసు బృందం కూర్చొన్నారు. దీంతో టిక్కెట్ కలెక్టర్ వారిని ఈ విషయమై నిలదీయగా..రకరకాలుగా బెదిరింపులకు దిగడం చేశారు. ఐతే టీటీ కూడా ఏమాత్రం తగ్గకుండా వారిని ఆయా సీట్ల నుంచి ఖాళీ చేయించాడు. దీంతో ఆ పోలీసులు ఇక చేసేది లేక అలా నుంచునే ఉన్నారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఐతే ఈ విషయంపై స్పందించిన సంబంధిత రైల్వే పోలీసులు ఈ ఘటనపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు నివేదించినట్లు తెలిపారు.
Here's Video
…तू शेर तो मैं सवा शेर..
A team of @Uppolice at receiving end from an empowered senior citizen passenger who objected the ‘दादागिरी’ of men in uniform. A regular in trains crossing UP where reserved passengers are intimidated to share space @RailMinIndia pic.twitter.com/ZJUiDicnCv
— Deepak Kumar Jha (@journalistjha) March 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)