ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర‌(Kedarnath Dham Yatra)ను నిలిపివేశారు. సోన్‌ప్ర‌యాగ్‌, గౌరికుండ్ వ‌ద్ద యాత్రికుల‌ను నిలిపివేసిన‌ట్లు అధికారులు ఇవాళ ప్ర‌క‌టించారు. భ‌క్తుల భ‌ద్ర‌త నేప‌థ్యంలో ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోవ‌డంతో యాత్రికుల్ని ఆపేసిన‌ట్లు తెలిపారు.భారీ వ‌ర్షాల కార‌ణంగా ఐఎండీ ఇవాళ ఉత్త‌రాఖండ్ కోసం ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. మందాకిని, అల‌క‌నంద న‌దులు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ ట్వీట్ చేసింది.ఇక గంగోత్రి జాతీయ ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల న‌లుగురు మృతిచెందారు. ప‌ది మంది గాయ‌ప‌డ్డారు

ANi Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)