ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసివేశారు. చమోలి జిల్లాలో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారి (Badrinath Highway)పై భారీగా కొండ చరియలు విరిగిపడ్డారు. దీంతో ఆ రహదారిని కూడా సుమారు 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. షాకింగ్ వీడియో, చూస్తుండగానే విరిగిపడిన కొండచరియలు, భయంతో పరుగులు పెట్టిన యాత్రికులు
హైవే మూసివేతతో బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్‌లతో కనెక్టివిటీ తెగిపోయింది. సుమారు 2,000 మంది యాత్రికులు (Devotees Stranded) హైవేపై చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Here's News
Badrinath Highway Closed For 48 Hours, Landslides Keep Devotees Stranded https://t.co/OKpLQOPyH0 pic.twitter.com/FLVKQKfoH3
— NDTV (@ndtv) July 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)