వాహనం లోయలో పడిపోవ‌డంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారి మీదుగా మహీంద్ర మ్యాక్స్ వాహనంలో ఓ వివాహానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు స‌హాయక చ‌ర్య‌ల్లో పాల్గొని ప‌లు వివ‌రాలు తెలిపారు. పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్ పెళ్లి వేడుక సంద‌ర్భంగా వారంతా గ‌త‌ అర్ధరాత్రి తర్వాత మహీంద్ర మ్యాక్స్ వాహనంలో సొంత ప్రాంతానికి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని వివ‌రించారు.

ఈ రోజు తెల్ల‌వారుజామున‌ 3.20 గంటల సమయంలో వాహనం అదుపు తప్పి, రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంద‌రికి గాయాలు కావ‌డంతో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)