ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు. వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటానని ఆయన ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ఆకాంక్షిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు గారు క‌రోనా నుంచి వేగంగా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను. త్వ‌ర‌లోనే మీరు కోలుకోవాలి స‌ర్' అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంద‌రూ క‌రోనా పరీక్ష‌లు చేయించుకోవాల‌ని వెంక‌య్య నాయుడు కోరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)