తమిళనాడు రాష్ట్రం చెన్నై (Chennai)లో అత్యంత ఖరీదైన కారు బీఎండబ్ల్యూ మంటల్లో కాలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 37 ఏళ్ల అరుణ్ బాలాజీ బీఎండబ్ల్యూ కారు (BMW Car) లో తిరువల్లికేణి నుంచి తిండివనం వెళ్తున్నాడు. ఈ క్రమంలో క్రోంపేట సమీపంలోకి రాగానే కారు నుంచి పొగలు రావడంతో డ్రైవర్ పార్థసారధి కారు ఆపాడు.
కిందకు దిగి పరిశీలించేలోపే క్షణాల్లో మంటలు వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటల్లో ఖరీదైన కారు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఊహించని ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు గంటపాటు జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఆ తర్వాత ట్రాఫిక్ సిబ్బంది వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Here's Video
This is scary. #BMW car caught fire at Chrompet, Chennai. #ChennaiRains pic.twitter.com/Ob1MgKH5ZA
— The Dreamer (@Asif_admire) July 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)