ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో షాజాహన్‌పూర్‌లో ఓ మేనేజర్(Manger)ను చితక్కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి ముందు పడేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాన్స్‌పోర్టు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న శివమ్ జోరీని..పార్సిల్ మిస్సింగ్ విషయంలో ఆ కంపెనీ ఓనర్లు అటాక్ చేశారు. ఓ పోల్‌కు కట్టేసి మరీ అతన్ని రాడ్డుతో చిదకబాదారు. చనిపోయిన అనంతరం మెడికల్ కాలేజీ వద్ద అతన్ని శవాన్ని పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
కరెంటు షాక్ వల్ల అతను చనిపోయినట్లు ఫ్యామిలీ మెంబర్స్‌కు తెలిపారు. అయితే మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆ వ్యక్తికి గాయాలైనట్లు గుర్తించారు. దీంతో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ మేనేజర్ దొంగతానానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఏడు మంది మర్డర్ కేసు నమోదు అయ్యింది. పోస్టుమార్టమ్‌లో మరిన్ని నిజాలు బయటపడనున్నట్లు భావిస్తున్నారు.
Here's Video
A man in Uttar Pradesh's #Shahjahanpur was beaten to death. Video showed man tied to a pole and a man repeatedly hit him with a rod. The manager was reportedly accused of theft.#UttarPradesh #crime pic.twitter.com/H1D4oJntdK
— Anil Kumar Verma (@AnilKumarVerma_) April 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)