మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఈరోజు ఏపీ అసెంబ్లీకి వెళ్లి.. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి... జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం సీఎంఓ అధికారులను కూడా ఆమె కలిశారు. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై వారితో చర్చించారు. కేసు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె కోరినట్టు తెలుస్తోంది.
YS Sunitha Reddy came to Andhra Pradesh Assembly
*సీఎం ఛాంబర్ లో చంద్రబాబు నాయుడిని కలిసిన సునీత .
*ఇటీవల వివేకా హత్య కేసు హైదరాబాద్ నుంచి కడపకు బదిలీ.
*రెండు రోజుల క్రితం కడపకు చేరుకున్న వైఎస్ సునీత.
*కేసు విచారణ గురించి సీఎం చంద్రబాబుతో సునీత చర్చించినట్లు సమాచారం.#ChandrababuNaidu #TDPTwitter #Andrapradesh pic.twitter.com/14439UOaNG
— Aadhan Telugu (@AadhanTelugu) November 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)