కర్నాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది. దాంతో, ఓ జేసీబీ, 100 మంది మనుషుల సాయంతో హెలికాప్టర్‌ను బురద నుంచి బయటికి తీసుకువచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది తప్పిదం వల్లే ప్రధాని మోడీ ఎస్కార్ట్ హెలికాప్టర్‌కు ప్రమాదం ఎదురైందని భావిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)