దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. దీంతో అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇవాళ ఉద‌యం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహ‌న‌దారులు తెగ ఇబ్బందిప‌డ్డారు. సియాన్‌, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని ఏరియా రూట్ల‌లో రైళ్లు, బ‌స్సు స‌ర్వీసుల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న రైల్వే ట్రాక్‌ల‌పై వ‌ర‌ద నీరు చేరుతోంది. ముంబైలో స్వ‌ల్ప స్థాయి నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాబోయే కొన్ని రోజుల్లో ప‌లు చోట్ల అతిభారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్సు ఉన్న‌ట్లు కూడా చెప్పింది. వ‌ర్షాల నేప‌థ్యంలో ఎన్డీఆర్ఎప్ ద‌ళాల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ముంబైతో పాటు స‌మీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్‌ ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)