West Bengal Lockdown: రేపటి నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రేపటి (ఆదివారం) నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ కాలంలో అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కతా మెట్రో సహా రవాణా వ్యవస్థను కూడా మూసివేసింది.
అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఇచ్చింది. కిరాణా దుకాణాలతోపాటు అత్యవసర వినియోగ వస్తువులు విక్రయించే దుకాణాలు ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు తెరిచిపెట్టుకోవచ్చని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఆశ్చర్యకరంగా మిఠాయి దుకాణాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. పెట్రోలు పంపులు, బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయి. అయితే, ఇవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే.
పరిశ్రమలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం తేయాకు తోటల్లో 50 శాతం సిబ్బందితో పనిచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సాంస్కృతిక, రాజకీయ, విద్యాపరమైన, మతపరమైన కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడాన్ని నిషేధించింది. వివాహ కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదని బందోపాధ్యాయ్ తెలిపారు.
West Bengal announces restrictions
West Bengal announces restrictions, to be imposed from 6 am on May 16 to 6 pm on May 30
Schools, govt/pvt offices, malls, cinema halls, restaurants, gyms to be closed; metro, intra-state transportation suspended; movement of pvt vehicles prohibited. Emergency services exempted. pic.twitter.com/bitlbn3jQ3
— ANI (@ANI) May 15, 2021
Academic, cultural, administrative, political & religious gathering remain prohibited. No more than 50 people allowed in wedding functions. Movement of private vehicles, taxi, auto to be suspended from tomorrow till May 30. Schools to remain closed: West Bengal Chief Secretary pic.twitter.com/sICIUWGJ03
— ANI (@ANI) May 15, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 15, 2021 03:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

