భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్న టాప్ రెజ్లర్లు మళ్లీ విధుల్లోకి చేరారు. రైల్వే శాఖకు చెందిన ఓఎస్డీ పోస్టుల్లో సాక్షీ మాలిక్, పూనియా మళ్లీ చేరారు. శనివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మహిళా రెజ్లర్లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆందోళన విరమించినట్లు వచ్చిన వార్తలను సాక్షీ మాలిక్ కొట్టిపారేశారు. తప్పుడు వార్తలు ప్రసారం అవుతున్నట్లు ఆమె తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు అని సాక్షీ మాలిక్ ఇవాళ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. రైల్వే ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నానని, కానీ న్యాయం దొరికే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
ANI Tweet
Wrestlers Sakshee Malikkh and Bajrang Punia rejoin their posts as OSD (Sports) in Indian Railways.
(File pics) pic.twitter.com/jtYqDbMS40
— ANI (@ANI) June 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)