బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ పట్టణ రైల్వే స్టేషన్‌లోని టీవీ తెరపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నీలి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 5 నుంచి 10 నిమిషాలు ప్రసారమైన ఆ సమాచారాన్ని కొంతమంది తమ సెల్‍‌ఫోన్లలో చిత్రీకరించగా, మరికొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది టీవీ ప్రసారాలను నిలిపివేశారు.

ఈ విషయంపై సబ్ డివిజనల్ అధికారి ధనంజయ కుమార్, డీఎస్పీ అజయ్ కుమార్ చౌదరిలు స్పందించి, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత మార్చి నెలలో కూడా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలోని రైల్వే స్టేషన్‌లో ఏకంగా మూడు నిమిషాల పాటు నీలి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)