ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శశాంక్‌ మణి త్రిపాఠి ( Shashank Mani Tripathi) పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పడిన నామినేషన్ వేయడం సంగతి మరచిపోయారు. చివరకు నామినేషన్ దాఖలు కోసం రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్‌ కేంద్రానికి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నామినేషన్‌ కోసం పరుగులు తీయాల్సినంత ఆలస్యం ఎందుకైందని ఆయనను అడిగింది. నామినేషన్‌ కేంద్రానికి చేరుకునే ముందు ఒక కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పలువురిని కలవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. కాలేజీ రోజుల్లో తాను రన్నర్‌ అని, అది ఇప్పుడు ఉపయోగపడిందని చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)