లోక్ సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 48 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మహారాష్ట్రలోని వాండ్రే పశ్చిమ విధానసభ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడుగా సిద్ధిఖ్ పనిచేశారు.ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ మాజీ మంత్రి మిలింద్‌ దేవరా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన రాజీనామాపై సిద్ధిఖ్ మాట్లాడుతూ.. చెప్పడానికి చాలా ఉన్నాయి.. కానీ కొన్ని చెప్పకపోవడమే మంచిదని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

Here's Baba Siddique Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)