హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరభద్ర సింగ్‌(87) కన్నుమూశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి సూపరిండెంట్‌ వెల్లడించారు. 1934 జూన్‌ 23న హిమాచల్‌లోని సరహాన్‌ ప్రాంతంలో జన్మించిన వీరభద్ర సింగ్‌.. 1960ల్లో రాజకీయాల్లోకి వచ్చారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.వీరభద్ర సింగ్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)