పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. ప్రత్యేక పరిస్థితుల్లో గతేడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని వీడిన సంగతి విదితమే.తాజాగా పంజాబ్ మాజీ సీఎం బీజేపీలో జాయిన్ అయ్యాడు. అలాగే పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC)ని బీజేపీలో విలీనం చేశాడు.

ఇదిలా ఉంటే పంజాబ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పాటియాలా అర్బన్ నుంచి బరిలోకి దిగిన అమరీందర్ సింగ్ ఆప్ అభ్యర్థి చేతిలో 19,873 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తాజాగా అమరీందర్ సింగ్‌తోపాటు ఆయన పార్టీ పీఎల్‌సీలో చేరిన ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా నేడు కాషాయ కండువా కప్పుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)