ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. 690 అసెంబ్లీ స్థానాలకు 1,200 కౌంటింగ్‌ హాళ్లలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. పంజాబ్ ఫలితాలు వెలువడుతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా న్యూస్ ప్రకారం పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 117 స్థానాలకు గాను 64 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. అక్కడ అధికార ఏర్పాటుకు 59 సీట్లు అవసరం. అయితే ఈ సంఖ్యను ఆమ్ ఆద్మీ దాటేసి ముందుకు దూసుకుపోతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)