ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ఫలితాలపైనే అందరి దృష్టి ఉన్నది. పంజాబ్‌లో 117 స్థానాల్లో ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1304 మంది పోటీచేశారు. వీరిలో 93 మంది మహిళా అభ్యర్థులు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరందరి భవితవ్యం నేడు తేలనుంది. కాగా పంజాబ్‌లో ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)