పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భగత్‌ సింగ్‌ స్వస్థలం ఖతర్‌ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యారు. మాన్‌ ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీగా తరలి రావడంతో భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భగవంత్ మాన్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీకి మనీష్ తివారీ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. తనను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందువల్ల తాను ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీ తన పార్టీ (కాంగ్రెస్) ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన ప్రమాణ స్వీకారం చేసినపుడు తనను ఆహ్వానించకపోవడం విచిత్రమని పేర్కొన్నారు. ఈ మేరకు మనీష్ తివారీ ట్వీట్ చేశారు.

ఫిబ్రవరిలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. 117 స్థానాల్లో కేవలం 18 స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకోగలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ లభించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)