చంపావత్‌ ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఘన విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి పై 55 వేలకు పైగా ఓట్లతో విజయకేతనాన్ని ఎగురవేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలా గహ్తోరి డిపాజిట్‌ కోల్పోయారు. కాగా ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్‌ సింగ్‌ ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఈ ఉప ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి అయ్యింది.

కాగా మే 31న ఉత్తరాఖండ్‌, ఒడిశా, కేరళలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్‌ 3న వెలువడ్డాయి. ధామి గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. చంపావత్‌ నియోజకవర్గంలో రికార్డు విజయాన్ని నమోదు చేసినందుకు అభినందనలు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)