పితృ దినోత్సవ శుభాకాంక్షలు: అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి నాన్న. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. ఈ మెసేజెస్ ద్వారా నాన్నకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.

Happy Father’s Day 2022

ఓర్పుకు, సహనానికి మారుపేరు నాన్న. తండ్రులందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు

Happy Father’s Day 2022

నాన్న ఎప్పుడూ నాకు మొదటి స్నేహితుడు, ఆత్మ బంధువు, గురువు, దైవం అన్నీ నాన్నే.. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు

fathers day 2022

నాన్న అంటే  నమ్మకం, ఆత్మస్థయిర్యాన్ని పెంచే ఆయుధం.  పితృ దినోత్సవ శుభాకాంక్షలు

Fathers day 2022 Telugu

ఓడినప్పుడు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నేనున్నా కన్నా అంటూ ధైర్యం చెప్పే ఒకే ఒక వ్యక్తి నాన్న. ఫాదర్స్ డే శుభాకాంక్షలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)