Eid-ul-Fitr 2023: ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, ఇది దివ్య ఖురాన్ అవతరించిన మాసం అని వెల్లడి

సత్య నిష్ఠ, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాసం ముగించుకుని, ఈదుల్ ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న వారందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.

Eid-ul-Fitr 2023: ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, ఇది దివ్య ఖురాన్ అవతరించిన మాసం అని వెల్లడి
Pawan Kalyan (Photo-Video Grab)

రంజాన్ పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన ద్వారా స్పందించారు. సత్య నిష్ఠ, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాసం ముగించుకుని, ఈదుల్ ఫితర్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న వారందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ఉపవాసాలు, నిత్య ప్రార్థనలతో ముస్లింల లోగిళ్లన్నీ ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంటాయని వివరించారు. మానవత్వ విలువలను ద్విగుణీకృతం చేయాలని చాటిచెప్పే హితవచనాలు మానవాళి మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

Here's Janasena Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 21, 2023 08:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).