అఖండ భారతావని సగర్వంగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి దేశ ప్రజలందరూ గర్వపడేలా చేశారని సీఎం జగన్‌ అన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

‘దేశ ప్ర‌జ‌లంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మ‌న తెలుగు బిడ్డ పింగ‌ళి వెంక‌య్య‌గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు. కుల‌, మ‌త, ప్రాంతాల‌క‌తీతంగా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్ర‌జలంద‌రికీ సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

పింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో జరిగే కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, నగరిలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే, పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్‌ శాఖ ఆవిష్కరించనుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)