CM KCR Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్‌ ప్రసారాల ద్వారా వీక్షించాలని సూచన

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావంతో ఈసారి సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు.

CM KCR Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్‌ ప్రసారాల ద్వారా వీక్షించాలని సూచన
File image of Telangana CM KCR | File Photo

అందువల్ల భద్రాద్రి ఆలయంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్‌ ప్రసారాల ద్వారా వీక్షించాలని ప్రజలకు సూచించారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని అన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని శ్రీసీతారాములను సీఎం ప్రార్థించారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 21, 2021 11:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).