1971లో పాకిస్తాన్ తో సాగిన యుద్ధంలో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ యుద్దంలో భారతీయ సైనికులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి సాగించిన పోరు విజయవంతమైంది. ఈ అద్భుత విజయానికి నేటితో 50 ఏళ్లు నిండాయి. అప్పటికీ, ఇప్పటికీ ఆ జ్ఢాపకాలు మాత్రం భారతీయుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. విజయ్ దివస్ 2021 సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 50వ విజయ్ దివస్ సందర్భంగా, భారత సాయుధ బలగాల్లోని ధైర్యవంతుల గొప్ప పరాక్రమాన్ని, త్యాగాన్ని నేను గుర్తుచేసుకుంటున్నాను. కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించాం. ఢాకాలో రాష్ట్రపతి జీ ఉనికి ప్రతి భారతీయుడికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉందని ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)