Newdelhi, Dec 5: ఉప్పు (Salt) అధికంగా తీసుకోవడం వల్ల బీపీతో (BP)(రక్తపోటు) పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అధికంగా ఉప్పును తినడం వల్ల పొట్ట సంబంధిత క్యాన్సర్ (stomach cancer) వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ 10 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పును తినడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని జపాన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం వెల్లడించింది. దీనిపై లోతుగా తెలుసుకోవడానికి ఎలుకలపై పరిశోధనలు నిర్వహించారు. ఉప్పు ఎక్కువవడం వల్ల కడుపులోని ఒక పొర దెబ్బతిని క్యాన్సర్‌కు దారితీస్తుందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి. గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మనం తీసుకొనే రోజువారీ ఉప్పును 6 గ్రాముల కంటే తక్కువగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
New Arogyasri Cards: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 18 నుంచి ఆరోగ్యశ్రీ కొత్తకార్డుల పంపిణీ
Dr Prashant Chandra, Consultant OncoSurgeon, DPU Private Super Specialty Hospital explains how salt is the cause for stomach cancer#Cancer #Health #Fitness https://t.co/4yFEMjEAMT
— News18.com (@news18dotcom) December 3, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)