న్యూఢిల్లీ, జనవరి 16: భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ లో మరో మైలురాయిని చేరుకుంది. వ్యాక్సినేషన్ ప్రారంభించి నేటికి సరిగ్గా ఏడాది… 2021 జనవరి 16న దేశంలో తొలిసారి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఏడాదిలో మన దేశంలో 156కోట్ల 80లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. దేశంలో మొదట ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ముందు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత దశల వారీగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 15 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి తొలి డోస్ ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోస్ ఇస్తున్నారు.
#1YearofVaccineDrive #LargestVaccineDrive #Unite2FightCorona @PMOIndia @mansukhmandviya @ianuragthakur @DrBharatippawar @PIB_India @mygovindia @COVIDNewsByMIB @DDNewslive @airnewsalerts @AmritMahotsav pic.twitter.com/1NJjcAZKRg
— Ministry of Health (@MoHFW_INDIA) January 16, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)