అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. గురువారమే గర్భాలయానికి బలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలరాముని విగ్రహం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన భక్తులు.. జైశ్రీరామ్‌ అంటూ పులకించిపోతున్నారు.

First Images of Ram Lalla Idol Unveiled

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)