ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో జరిగిన తేలు పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండగలోకి వెళితే..ఈ గ్రామ ప్రజలు తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. అంతేకాదు దాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నైవేద్యంగా సమర్సిస్తారు. ఇది వారి ఆచారం. అవి కుట్టినా గుడి చెట్టు మూడు ప్రదక్షిణలు చేస్తే నొప్పి మటుమాయం అవుతుందని వారి నమ్మకం.
కర్నూలు జిల్లా కోడుమూరులో కొండపై కొండలరాయుడి ఆలయం ఉంది. ఇక్కడి స్వామిని వేంకటేశ్వరుడి ప్రతిరూపంగా భావించి కొలుస్తారు. ఏటా శ్రావణ మాసం మూడో సోమవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు కొండపై ఏ రాయి కదిపినా తేల్లు ప్రత్యక్షమవుతాయి. అక్కడ భక్తులు ముందుగా తేళ్ల కోసం వేట కొనసాగిస్తారు. అవి దొరికితే దానికి దారం కట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు.
Here's Video
Visuals of Scorpion Festival celebrations at Kodumur town of Andhra Pradesh's Kurnool district. pic.twitter.com/Vq5TJvcZKZ
— Press Trust of India (@PTI_News) September 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)