దక్షిణాఫ్రికాకు చెందిన వుయోల్వెతు సిమనైల్‌ అనే యువతి కేవలం 60సెకన్లలో ఏకంగా మూడున్నర కోడికాళ్ల (121 గ్రాముల బరువైన)ను గుటుక్కుమనిపించేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెల కొల్పింది.డర్బన్‌లోని ఉమ్లాజీలో ఉన్న మాషమ్‌ప్లేన్స్‌ లాంజ్‌ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌లో ఇటీవల జరిగిన ఈ పోటీలో ఆమె ఈ ఘనత సాధించింది. పోటీలో పాల్గొన్న ఐదుగురిలో ఒక యువతి కోడి కాలును నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పడంతో అక్కడ్నుంచి లేచి వెళ్లిపోగా సిమనైల్‌ మాత్రం ఎటువంటి తత్తరపాటుకు లోనుకాకుండా వాటిని ఆరగించేసింది. ఈ పోటీ స్టంబో రికార్డ్‌ బ్రేకర్స్‌ అనే చానల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)