పిల్లాడికి విమానాలంటే పిచ్చి కావడంతో విమాన సిబ్బంది ఈ సాహసానికి పూనుకొన్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి విమానాలంటే క్రేజీగా ఉన్న ఆ పిల్లాడిని విమానం సిబ్బంది కాక్‌పీట్‌లోకి తీసుకెళ్లి పైలెట్ సీటులో కూర్చోబెట్టారు. ఆ త‌ర్వాత ప‌క్క‌నే కూర్చున్న పైలెట్.. ఆ బుడ్డోడికి క్యాప్ పెట్టి.. విమానాన్ని ఎలా న‌డ‌పాలో.. ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి.. వావ్.. పిల్లోడి క‌ల ఫ‌లించింది. అంత చిన్న వ‌య‌సులోనే పైలెట్ సీటులో కూర్చున్నాడంటే గ్రేట్. అ పిల్లోడిలో ఫ్యూచ‌ర్ పైలెట్ క‌నిపిస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)