Newdelhi, Aug 15: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) ఇప్పటి వరకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడడంతో జాతీయ రహదారులపై రవాణా స్తంభించింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మృతి చెందిన 54 మందిలో 51 మంది ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే మృతి చెందడం గమనార్హం. ఉత్తరాఖండ్ లోముగ్గురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడడంతో భవనాలు ధ్వంసమయ్యాయి. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వెళ్లే రహదారులపై రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో చార్‌ధామ్ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేశారు.
Flood In #Rishikesh 🚨🚨#Ganga flowing above danger mark in #Rishikesh 🚨🚨#Dehradun #Himachal #HimachalFloods #HimachalPradesh #himachalrains #Flood #Shimla #Uttarakhand https://t.co/JLSQM1pzan pic.twitter.com/HkyMItEi0B
— Ratnesh Mishra 🇮🇳 (@Ratnesh_speaks) August 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)