తమిళనాడులోని సూలూరు శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు వచ్చిన ఓ మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మరణించిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం అంత్యక్రియల కోసం సోమవారం సూలూర్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ సమయంలో మృతుడి బంధువులతో పాటు 8 మంది అఘోరాలు కూడా వచ్చారు.
మృతదేహాన్ని దహనం చేసేముందు అఘోర ఆ శవంపై కూర్చొని పూజలు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో మీడియా ప్రతినిధులు శ్మశాన నిర్వాహకుడు సురేష్ను ఈ విషయంపై ప్రశ్నించారు. అయితే బంధువుల అనుమతితోనే అఘోర పూజలు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)