సోషల్‌ మీడియాలో ఎ‍ప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహింద్రా ఒక వైరల్‌ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో స్నేహం విలువ, స్నేహితుడి అంటే ఎలా ఉండాలో చెబుతుందని అన్నారు. షేర్ చేసిన వీడియోలో..రెండు తాబేళ్లు ఉన్నాయి. అందులో ఒక తాబేలు వెనక్కి తిరగబడి ఇబ్బందిపడుతోంది. దీంతో ముందు వెళ్తున్న తాబేలు తనతో ఉన్న మరో తాబేలు రావడం గమనించింది. దీంతో ఆ తాబేలు ఆగి మరీ వెనక్కి వచ్చి అవస్థలు పడుతున్న ఆ తాబేలుకు సాయం చేస్తుంది. దీంతో ఆ తాబేలు హమ్మయ్య అనుకుంటూ చకచక వెళ్లిపోతుంది.

ఈ వీడియోని సోషల్‌ మీడియాలో చేసిన మహీంద్రా... స్నేహానికి అసలైన అర్ధం ఇదే కదా. మనం సమస్యల్లో ఉన్నప్పుడూ మనకు చేయూత నిచ్చి మన కాళ్లపై తిరిగి నిలబడేలా చేసేవాడు నిజమైన స్నేహితుడు. ప్రతిఒక్కరు తమ జీవితంలో మంచి స్నేహితుడి కలిగి ఉండటానికి మించిన గొప్పవరం ఇంకొకటి లేదు." అని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)