పెళ్లి కోసం మ్యాట్రిమోనీ సైట్లలో ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ పోస్టులోకి వెళితే..భారత్‌కు చెందిన ఓ వ్యక్తి బెటర్‌హాఫ్.ఏఐ అనే మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్‌లో పెళ్లి కోసం ప్రకటన (Bizarre Matrimonial Advertisement) ఇచ్చాడు. ప్రొఫైల్‌లోని బయో అనే సెక్షన్‌లో తన భాగస్వామి ఎలా ఉండాలనే అంశం గురించి మరీ ఇలా రాశాడు. ‘‘సంప్రదాయవాద, ఉదారవాద, ప్రోఫెషనల్ లైఫ్ లీడ్ చేసే జీవిత భాగస్వామి కోసం చూస్తున్నాను. ఆమె ఎత్తు 5.2 నుంచి 5.6 మధ్య ఉండాలి. బరువు 105 ఎల్‌బీఎస్ నుంచి 115 ఎల్‌బీఎస్‌కు మించకూడదు. నడుము సైజు, వక్షోజాల సైజు (Man Wants Wife With Specific Boobs Size) ఇంతే ఉండాలి. ఆమె కచ్చితంగా మేనిక్యూర్, పెడిక్యూర్ చేసుకొని ఉండాలి.

వస్త్రధారణ కూడా 80 శాతం క్యాజువల్, 20 శాతం ఫార్మల్‌గా ఉండాలి. కానీ, మంచంపై పడుకున్నప్పుడు మొత్తం బట్టలు ధరించాలి. నమ్మకం, నిజాయతీ కలిగి ఉండాలి. సినిమాల పట్ల ఇష్టం, రోడ్ ట్రిప్స్, వంటివి ఇష్టం అయి ఉండాలి. కచ్చితంగా కుక్కల పట్ల ఇష్టం ఉండాలి. పిల్లలు అంటే ఇష్టం ఉండకూడదు. భాగస్వామి కచ్చితంగా 18 నుంచి 26 ఏళ్ల మధ్య వారు అయి ఉండాలి.’’ అని సదరు వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్‌లో పేర్కొన్నాడు.

Here's Viral matrimonial  AD

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)