డోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తాయి. అయితే ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాయి. దీంతో పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే తుఫాను కారణంగా వరదలు పోటెత్తడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని వాయిదా వేసుకుందామనుకున్నారు. అనుకున్న సమయానికే పెళ్లి జరగాలని వధువు పట్టుబట్టడంతో వరద నీటిలోనే వైభవంగా వీరికి పెళ్లి జరిపించారు. దాదాపు అడుగు మేర నీటిలో వధువు నడుచుకొని వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Bride Walks Down Flooded Aisle After Typhoon Doksuri In Philippines Watch Viral Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)