Bird Steals Currency Notes From Street: చైనాలో ఓ పక్షి కరెన్సీ నోట్ల దొంగతనానికి సంబంధించి 13 సెకన్‌ల నిడివిగల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను అటహరెకట్ పేరుతో ట్విటర్ (X) ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో నలుపు రంగులో ఉన్న ఓ పక్షి కరెన్సీ నోట్లను నోట కరుచుకుని బయటి నుంచి ఎగురుకుంటూ తన యజమాని ఇంట్లోకి వస్తుంది.
అక్కడి ఓ టేబుల్ ముందు వాలి లాకర్ తెరుచుకునే దాకా వేచిచూస్తుంది. ఆ సమయంలో ఆ ఇంటి పెంపుడు కుక్క టేబుల్ వెనుక నుంచి లాకర్ ముందుకు నెడుతుంది. తర్వాత పక్షి ఆ లాకర్ లో తాను తెచ్చిన కరెన్సీ నోట్లను అందులో వేస్తుంది.ఇలా ఆ డస్క్ ను పెద్ద మొత్తంలో నగదుతో నింపేసింది. పక్షి చేసే ఈ తమాషా తతంగాన్నంతా పెంపుడు కుక్క నిశితంగా పరిశీలిస్తుంది. వీడియో ఇదిగో..
Here's Video
Çin'de bir adam, kuşuna sokaktan para çalıp eve getirmeyi öğretti. 😂😂 pic.twitter.com/ba1p0A2aNu
— Ataharekat 🇹🇷 (@ataharekat) August 31, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)