Newyork, Feb 20: కోతుల (Monkeys) కోసం ఓ మినీ సిటీని (Mini City) నిర్మిస్తామని అందులో 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సేఫర్ హ్యూమన్ మెడిసిన్ అనే కంపెనీ ప్రకటించింది. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్ కంపెనీలకు పంపిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది. కంపెనీ ప్రకటనపై అమెరికాలోని జార్జియా స్టేట్, బెయిన్ బ్రిడ్జ్ పట్టణవాసులు, జంతు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. దాదాపు 14,000 జనాభాగల ఈ పట్టణంలో, 30,000 కోతులు ఉండటాన్ని తాము అంగీకరించబోమని, ఈ కంపెనీని తక్షణమే నిలిపేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Plan for US ‘mini-city’ of 30,000 monkeys for medical research faces backlash https://t.co/paIivdXycm
— Guardian Science (@guardianscience) February 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)