Newdelhi, Dec 18: అనేక దేశాల్లో కరోనా కేసులు (Corona Cases) వెలుగు చూస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ (WHO) కీలక సూచనలు చేసింది. వ్యాధి వ్యాప్తి తీరును జాగ్రత్తగా పరిశీలించాలని, వైరస్ (Virus) జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం ఎప్పటికప్పుడు పంచుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం 68 శాతం కేసులకు కరోనా ఎక్స్‌ బీబీ వేరియంట్ కుటుంబానికి చెందిన వైరస్‌లు, జేఎన్.1 లాంటి సబ్ వేరియంట్లు కారణమని వెల్లడించింది. ఇక, భారత్‌ లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ఆదివారం దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో ఐదుగురు కరోనాతో మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మృతుల్లో నలుగురు కేరళ వాసులు కాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి కరోనాతో కన్నుమూశారు.

President Murmu: నేడు హైదరాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)