ఢిల్లీ మెట్రో రైలులో లవర్స్ అందరి ముందే చెంపలు పగలకొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య టీ షర్ట్‌ ధరపై వాగ్వాదం మొదలవగా..ఆమె తాను వేసుకున్న టీ షర్ట్‌ను వేయి రూపాయలకు కొనుగోలు చేశానని చెప్పింది. ఈ క్రమంలో యువకుడు.. ఆ టీ షర్ట్‌ రూ. 150కే దొరుకుతుందని ఫన్నీగా అన్నాడు. దీంతో, ఆమె కోపంతో ఊగిపోయి.. యువ‌కుడి చెంప చెల్లుమ‌నిపించింది. ఈ క్రమంలోనే "మమ్మీ కో బోలుంగీ మెయిన్" (నేను తల్లికి చెబుతాను) అని చెబుతుంది.

దీనికి వెంటనే.. సదరు యువకుడు.."తేరే జైసా లడ్కా కిస్కికో నా మైలే" (నీలాంటి వ్యక్తి ఎవరికీ ఉండకూడదు) అంటూ బదులిచ్చాడు. దీంతో, మరింత రెచ్చిపోయిన యువతి.. వ‌రుస‌గా ఆమె చెంప‌దెబ్బ‌లు కొడుతుండ‌టంతో యువ‌కుడు కూడా ఆమె చెంప చెల్లుమ‌నిపించాడు. అనంతరం ఒకరిపై ఒకరు అరుచుకుంటూ స్టేషన్‌ రాగానే రైలు దిగి వెళ్లిపోయారు. అనంతరం వారి చేష్టలకు షాకైన ప్రయాణికులు నవ్వుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)