ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దసరా రోజున ఆంజనేయుడు డ్రోన్ రూపంలో ఎగురుతూ కనిపించాడు. విషయంలోకి వెళితే..అంబికాపూర్‌లో ఈ నెల 24న దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుకలను డ్రోన్ ద్వారా చిత్రీకరించాలనుకున్నారు. అయితే, మామూలుగా అయితే మజా ఏముంటుందని భావించిన నిర్వాహకులు ఆ డ్రోన్‌ అచ్చం గాల్లో ఎగురుతున్న ఆంజనేయుడిలా తీర్చిదిద్దారు. గాల్లో ఎగురుతున్నట్టుగా ఉన్న ఆంజనేయుడి ప్రతిమను తయారుచేసి దానికి బిగించారు.

అంబికాపూర్‌లోని మహామాయ ఆలయం వద్ద జరిగిన భారీ ఊరేగింపును ఈ ఆంజనేయుడి డ్రోన్‌తో చిత్రీకరించారు. గాల్లో ఎగురుతున్న ‘హనుమంతుడి’ని చూసిన జనం కేరింతలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. కింద ఊరేగింపును బంధిస్తున్న డ్రోన్‌ను జనం తమ సెల్‌ఫోన్లు, కెమెరాల్లో బంధించారు. ఇప్పుడీ హనుమాన్ డ్రోన్ నెట్టింట వైరల్‌గా మారింది.

Hanuman drone leaves internet in awe. See viral video

Here's Viral Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)