మనం రైలులో ప్రయాణం చేసే సమయంలో అందులో రష్ చూస్తే చిరాకుతో పాటు ఎక్కడ లేని కోపం వస్తుంది. కనీసం కాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేనంత రద్దీగా ఉంటుంది. మరి అంతటి రద్దీలో మనకే ప్లేసు లేకుంటే ఓ యజమాని తన గుర్రాన్ని లోకల్ ట్రైన్ లో తీసుకువెళ్లాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం డైమండ్ హార్బర్ లోకల్ రైలులో ఓ గుర్రం రద్దీగా ఉన్న ప్రయాణికుల మధ్య ప్రయాణిస్తూ కనిపించింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో రైల్వే శాఖ దీనిపై విచారణ ప్రారంభించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)