కారులో క‌నిపించిన నాగు పామును ఓ వ్య‌క్తి కాపాడి దాన్ని తిరిగి అడ‌విలో విడిచిపెట్టిన వీడియో(Viral Video) ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా పెద్ద‌సంఖ్య‌లో నెట‌జన్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.ఈ క్లిప్‌లో కారులో నాగు పాము క‌నిపించ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన వ్య‌క్తి వెంట‌నే పాములు ప‌ట్టుకునే వ్య‌క్తిని పిలిపించ‌గా ఆ వ్య‌క్తి పామును కాపాడి దాన్ని అడ‌విలోకి తిరిగి పంపించ‌డం క‌నిపిస్తుంది. 15 అడుగుల పొడ‌వైన పామును అత‌డు ఓ బ్యాగ్‌లో చుట్టి ఆపై దాన్ని అడ‌విలో వ‌దిలిపెట్ట‌డం చూడొచ్చు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)