రోడ్డు మీద వెళుతుంటే వెనక నుంచి వచ్చే వాహనాలు అవసరం లేకపోయినా హారన్ పెద్దగా మోగిస్తూ వాహనదారులతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. అలాంటి వారికి బెంగుళూరు పోలీసులు ఇచ్చిన పనిష్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా రోడ్డుపై వెళ్తుంటే సడెన్‌గా వెనుక నుంచి పెద్ద హారన్ సౌండ్ విని గుండె దడ వచ్చేస్తుంది. అలా హారన్ కొట్టిన ఓ డ్రైవర్‌కు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్ విధించిన పనిష్మెంట్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

పనిమనిషి అకృత్యం.. యజమానికి ఇచ్చే జ్యూస్ లో మూత్రం కలిపి సర్వింగ్.. యూపీలో ఘటన (వీడియో)

అతడిని తను నడిపై బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టడంతో సదరు డ్రైవర్ సౌండ్ భరించలేకపోయాడు. నన్ను వదిలేయండి సార్ అని మొత్తుకున్నాడు. మరి నువ్వు కొట్టినప్పుడు కూడా ప్రజలకు ఇలాగే ఉంటుంది' అంటూ డ్రైవరుకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేస్తున్నారు. శభాష్ పోలీస్ అని కొందరు అంటే మరికొందరు పనిష్మెంట్‌ అలాగే ఉండాలి అప్పుడే బుద్ధి వస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

హారన్ కొట్టిన డ్రైవర్‌కు దిమ్మతిరిగే పనిష్మెంట్‌ ఇచ్చిన పోలీసులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)