జ‌మ్మూ క‌శ్మీర్‌కు చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఢిల్లీలోని ఓ హోట‌ల్ వ‌స‌తికి నిరాక‌రించిందనే వీడియో (Kashmiri man denied room at Delhi hotel) సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కశ్మీర్‌కు చెందిన ఓ వ్య‌క్తి త‌న ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు స‌రిగ్గా చూపించినా… ఆ హోట‌ల్ యాజ‌మాన్యం వ‌స‌తికి నిరాక‌రించింది. కేవ‌లం ఆయ‌న క‌శ్మీర్‌కు చెందిన వ్య‌క్తి కావ‌డంతోనే ఆయ‌న వ‌స‌తికి ఓయో యాజ‌మాన్యం నిరాక‌రించింది.

జ‌మ్మూ క‌శ్మీర్‌కు సంబంధించిన వ్య‌క్తుల‌కు హోట‌ల్‌లో వ‌స‌తి ఇవ్వ‌కూడ‌ద‌ని ఢిల్లీ పోలీసులు త‌మ‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చార‌ని, అందుకే తాము ఆ వ్య‌క్తికి వ‌స‌తి నిరాక‌రించామ‌ని ఓయో యాజ‌మాన్యం పేర్కొంది. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. మేము ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ట్విట్టర్లో పేర్కొన్నారు.

జ‌మ్మూ క‌శ్మీర్‌కు చెందిన ఐడీ ఉన్న కార‌ణంగా ఓ వ్య‌క్తికి హోట‌ల్ యాజ‌మాన్యం వ‌స‌తి నిరాక‌రించింద‌న్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఢిల్లీ పోలీసుల మార్గ‌ద‌ర్శ‌కాల వ‌ల్లే తాము వ‌స‌తి నిరాక‌రించామ‌ని హోట‌ల్ యాజ‌మాన్యం పేర్కొంది. ఇలాంటి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మేము జారీ చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాము అంటూ ఢిల్లీ పోలీసులు ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)