కర్ణాటక (Karnataka) రాష్ట్రం బెళగావి (Belagavi) జిల్లాలో గల హలగా గ్రామంలో ఓ బాలిక (young girl) పాము కాటు నుంచి తృటిలో తప్పించుకుంది. అదృష్టవశాత్తు పాము కాటు (Snake Bite) నుంచి కొద్దిలో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ ఇంటి గుమ్మం దగ్గర పాము బుసలు కొడుతూ ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన బాలిక.. పామును గమనించకుండా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.
డోర్ వద్దకు రాగానే పాము బాలికను కాటేయబోయింది. కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడంతో ఆ చిన్నారి ఒక్కసారిగా వెనక్కి వచ్చింది. అనంతరం ఇంట్లోకి పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో (CCTV footage) రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video
a young girl narrowly escaped grasp of a venomous cobra that had slithered onto the steps of Suhas Saibannawar's home in Halga.incident was captured on CCTV, revealing the terrifying encounter.snake expert Rama Patil was called to the scene and successfully captured the reptile. pic.twitter.com/NPc5744J6G
— All About Belgaum | Belagavi News (@allaboutbelgaum) May 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)