పోలీసులు వస్తున్నారని తెలిసిన అవినీతి సొమ్మును నమిలి మింగేసిన ఓ అధికారి వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌ కత్నికి చెందిన రెవెన్యూ అధికారి(పట్వారి) గజేంద్ర సింగ్‌ బర్ఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు లోకాయుక్తకు చెందిన స్పెషల్‌ పోలీస్‌​ ఎస్టాబ్లిష్‌మెంట్‌(SPE) అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ప్లాన్‌ ప్రకారం గజేంద్ర కోరిన ఐదు వేల లంచంతో బాధితుడు కార్యాలయానికి చేరుకున్నాడు.

గజేంద్ర లంచం తీసుకుంటున్న టైంలో ఎస్‌పీఈ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లను చూసి  అధికారి వెంటనే తప్పించుకోవాలనే ఆలోచనతో ఆ నోట్లను కసాబిసా నమిలి మింగేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని పరిశీలించి క్షేమంగానే ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Revenue Dept Official Caught Swallowing Bribe After Spotting Cops

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)