ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. పందెం బరులు వద్దే గుండాట మొదలైంది. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించారు నిర్వాహకులు.ఈ న్యూస్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అయింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు.  వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణ

పందెం గెలిస్తే విజేతలకు మహేంద్ర థార్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)